SKLM: జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం తెలిపారు. ఆదివారం 13 మండలాల్లోని 342 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 6,25,388 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అనంతరం మ. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపే పల్లెపోరు.. 342 పంచాయతీల్లో పోలింగ్


