ASR: ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన వ్యాసరచన, స్కిట్, క్విజ్ పోటీల్లో అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందిన 10 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈనెల 2 నుంచి 20 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్ నిశాంతి శనివారం కలెక్టరేట్లో బహుమతులు అందజేశారు. విజేతల్లో అరకు, పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు


