ప్రకాశం: కంభం మండలం నర్సిరెడ్డిపల్లె గ్రామ సర్పంచ్‌గా కూటమి బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ నారాయణ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సభ్యులు, ప్రజలు, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని శాలువా, పూలమాలతో సన్మానించారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గ్రామ ప్రజలకు మంత్రి, ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నర్సిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌గా లక్ష్మీ నారాయణ ఏకగ్రీవం


