హైదరాబాద్: 28°C
వార్తలు

చంద్రశేఖర్ ఆజాద్‌పై అత్యాచారం ఆరోపణలు

భీమ్ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్‌పై దాఖలైన ఫిర్యాదుపై రౌస్ అవెన్యూ కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఆయనపై అత్యాచారం ఆరోపణలు చేస్తూ ఓ మహిళ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆజాద్‌పై FIR నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదుదారు కోర్టును కోరుతున్నారు. ఈ వ్యవహారంలో ఉత్తర్వుల వెల్లడి కోసం రౌస్ అవెన్యూ కోర్టు ఈ అంశాన్ని DEC 23న లిస్ట్ చేసింది.