హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపల్లి సర్పంచ్‌గా ఈనపాటి ఉమ ఏకగ్రీవం

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి సర్పంచ్‌గా ఈనపాటి ఉమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీలోని 20 వార్డులకు గాను 14 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. ఎన్నికల అధికారి హేమంత్ కుమార్ రెడ్డి సర్పంచ్, వార్డు సభ్యులకు అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు.