మహ్మద్ సిరాజ్ కెరీర్ దాదాపు ముగిసినట్లేనని అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడికి ఇకపై అవకాశాలు దక్కడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎవరైనా అతడితో మాట్లాడి భవిష్యత్తుపై సరైన దిశానిర్దేశం చేయాలని సూచించాడు. ప్రస్తుతం జట్టు యాజమాన్యం సీనియర్లను పక్కనబెట్టి యువ ఆటగాళ్లతో ముందుకు వెళ్లాలని భావిస్తోందంటూ వ్యాఖ్యానించాడు. కానీ, సిరాజ్కు ఇది మంచి ముగింపు కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
క్రీడలు
సిరాజ్ కెరీర్ ముగిసినట్లేనా?


