హైదరాబాద్: 28°C
వార్తలు

డీలిమిటేషన్ బిల్లుపై కీలక అప్‌డేట్

‘ది డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు, 2026’ను పరిశీలించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభకు సిఫార్సు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(3) ప్రకారం ఈ సిఫార్సు చేసినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ బులెటిన్ ద్వారా వెల్లడించారు. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నిన్న పంపిన లేఖ మేరకు ఈ బులెటిన్ విడుదలైంది.