హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ డబ్బులు అడిగినందుకు ఘోరం

BPT: చీరాల జాతీయ రహదారిపై ఉన్న భారత్ పెట్రోల్ బంకులో అర్ధరాత్రి షిఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన దుండగులు రూ.4,195 పెట్రోల్ పోయించుకుని డబ్బులు చెల్లించకుండా పరారయ్యేందుకు యత్నించారు. అడ్డుకోబోయిన బంకు సిబ్బంది చింతాసాగర్‌ను కారుతో 100 మీటర్లు ఈడ్చుకెళ్లి రోడ్డుపై పడేశారు. తలలో రక్తం గడ్డకట్టడంతో మెరుగైన వైద్యం కోసం సాగర్‌ను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.