హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ బాండ్ల సేకరణకు తాత్కాలిక విరామం

SKLM: జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల ఒరిజినల్ బాండ్ల సేకరణ ప్రక్రియకు తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు CID డీఎస్పీ కాళిదాసు శనివారం తెలిపారు. సీఐడీ సిబ్బంది ఎన్నికల విధులు, ఇతర అత్యవసర విధుల్లో నిమగ్నమై ఉన్నందున నవంబర్ 30 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు బాండ్ల సేకరణ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. బాధితులు అప్పటివరకు సహకరించాలని కోరారు.