హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేతివారిపల్లి సర్పంచ్ పద్మశ్రీకి అభినందనలు

అన్నమయ్య: చిట్వేల్ మండలం నేతివారిపల్లి సర్పంచ్‌గా కూటమి బలపరిచిన చిట్టిప రెడ్డి పద్మశ్రీ విజయం సాధించారు. గ్రామ నాయకులతో కలిసి ఓబులవారిపల్లె ఎంపీపీ ముక్కా సాయి వికాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయానికి సహకరించిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశ్రీని అభినందించిన ముక్కా సాయి వికాస్ రెడ్డి, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.