E.G: తొస్సిపూడి–బలభద్రపురం రోడ్డులో వాహనం చెట్టును ఢీకొనడంతో మేడపాడు గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెంటనే స్పందించి, క్షతగాత్రులను అంబులెన్స్‌లో అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే


