హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ నర్సీపట్నమే లక్ష్యం: ఛైర్‌పర్సన్

AKP: నర్సీపట్నం పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ఛైర్‌పర్సన్ చింతకాయల పద్మావతి శనివారం మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెత్త సేకరణ, కార్మికుల కొరత, దోమల నివారణ చర్యలపై ఆరా తీశారు. వార్డుల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలో సచివాలయాల పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపడతానని, స్వచ్ఛ నర్సీపట్నమే లక్ష్యమని తెలిపారు.