హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫేజ్-3లో 23 సర్పంచ్, 680 వార్డులు ఏకగ్రీవం

కృష్ణా జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో 213 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 23 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 190 సర్పంచ్ స్థానాలకు 483 మంది పోటీపడుతున్నారు. అలాగే 2068 వార్డులకు గాను 680 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.