WNP: ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు చిట్యాల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు. ఇందులో బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనక్ అవార్డ్స్, పీఎం శ్రీ పాఠశాలల సైన్స్ ఎగ్జిబిషన్, తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలన్నారు.
తెలంగాణ
సైన్స్ ఎగ్జిబిషన్‌కు డీఈవో ఆహ్వానం


