హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొడ్డిపట్ల సర్పంచ్‌గా శ్రీరామ్ తల్లి ఏకగ్రీవ ఎన్నిక

W.G: ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లి చేగొండి ఉమారాణి యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన మద్దతుతో పోటీ చేసిన ఆమెపై ప్రత్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయంగా రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు అనంత శ్రీరామ్ ప్రకటించారు.