హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విదేశీ గళాల్లో అన్నమయ్య సంకీర్తన.. అద్భుతం!.

TPT: స్విట్జర్లాండ్‌లో జరిగిన సోల్స్‌బర్గ్ ఫెస్టివల్–2026లో ప్రముఖ గాయక బృందం ‘చాంటిక్లీర్’ అన్నమయ్య సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ పాటతో అలరించారు. తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ఈ సంకీర్తన విదేశీ గాయకుల గళాల్లో వినిపించడం ప్రతి తెలుగు వారికీ గర్వకారణం. ప్రదర్శనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.