హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోరు సర్వీస్ వైర్ దొంగను పట్టుకున్న రైతులు

MNCL: మందమర్రి మండలం,దుబ్బపల్లి పంట పొలాల్లో బోరు సర్వీస్ వైరును కట్ చేస్తున్న దొంగను స్థానికులు పట్టుకున్నారు. శనివారం పొలాల్లో వైరు కత్తిరిస్తుండగా గమనించిన రైతులుఅతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ నరేశ్ ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.