ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండల కేంద్రంలో శివాజీ నగర్, సినిమాహాలు వీధి ప్రాంతాలలో గత మూడు నెలలుగా కుళాయిలకు నీరు రావడం లేదంటూ మహిళలు కొమరోలు పంచాయతీ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రధాన రహదారిలో ధర్నాకు దిగారు. గంట పాటు వాహనాలు ఆగిపోయాయి. సోమవారంలోగా సమస్యను పరిష్కరిస్తామని పంచాయతీ అభివృద్ధి అధికారి గీత హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్యపై మహిళల నిరసన


