హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల విజయోత్సాహాన్ని అభివృద్ధిలో చూపించాలి'

PPM: పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో సీతానగరం, పార్వతీపురం, బలిజిపేట మండలాలకు చెందిన నూతన సర్పంచ్‌లతో శనివారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు చూపిన ఉత్సాహం, పట్టుదల, సమష్టి కృషిని గ్రామాల అభివృద్ధిలోనూ కొనసాగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.