ASR: కొమ్మంగి గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూటమి ఓటమికి పార్టీల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని జనసేన నాయకుడు చల్లంగి శ్రీను ఆరోపించారు. పాడేరు టీడీపీ ఇంఛార్జి గిడ్డి ఈశ్వరి వ్యవహరించిన తీరుతో కూటమి అభ్యర్థులకు తగిన సహకారం అందలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడంతో ఓటమి ఎదురైందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి ఓటమికి సమన్వయ లోపమే కారణం'


