అనకాపల్లి కలెక్టరేట్లో శనివారం రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ సౌర్యమాన్ పటేల్ శిక్షణను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల విధులపై అధికారులకు శిక్షణ


