KDP: బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండల రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు కీలక పదవులు దక్కించుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు. టేకురుపేట పంచాయతీ సర్పంచి ఎన్నికల్లో 22 ఏళ్ల యువతి నగిరి శివసాహితి విజయకేతనం ఎగురవేశారు. ఎంసీఏ పూర్తిచేసిన ఆమె, చిన్న వయసులోనే ప్రజాసేవపై ఆసక్తితో బరిలోకి దిగి గెలుపొందారు. ఆమె తల్లి ప్రమీల ఎంపీటీసీగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
పోరుమామిళ్లలో తల్లి ఎంపీటీసీ , కూతురు సర్పంచ్


