హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసీస్ జట్టు ప్రకటన.. స్టార్ స్పిన్నర్‌పై వేటు

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్‌కు చోటు దక్కలేదు. 2011లో టెస్టు అరంగేట్రం చేసిన తర్వాత అతను జట్టుకు దూరమవ్వడం ఇదే తొలిసారి. గత 15 ఏళ్లుగా ఆసీస్ ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతున్న లియోన్, ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోవడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అతడు 145 టెస్టుల్లో 577 వికెట్లు పడగొట్టాడు.