KDP: సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రామచంద్రారెడ్డి, శంకర్రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఘన మద్దిలేటి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పైడిపాలెంలో ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు


