హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్ వినియోగంపై అవగాహన

PPM: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్రగ్స్‌పై డా. పావని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగాన్ని నివారించడానికి వ్యక్తిగత జాగ్రత్తలు అవసరమని అన్నారు. వీటి వాడకం వల్ల కాలేయం, మూత్రపిండాలు, గుండెపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ధూమపానం లేదా పీల్చే డ్రగ్స్ వలన దీర్ఘకాలిక దగ్గు, శ్వాస ఆడకపోవడం, బ్రాంకైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.