హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

TPT: నాయుడుపేట పట్టణంలో శనివారం జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జువ్వలపాటి మస్తాన్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడుతూ, ఆశయ సాధనకు కృషి చేస్తామని మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.రామయ్య, ఆవుల వినోద్ కుమార్ పాల్గొన్నారు.