హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెప్ప బోల్తా.. మత్స్యకారుడు మృతి

SKLM: వజ్రపుకొత్తూరు మండలం దేవునళ్తాడ సముద్ర తీరంలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేట ముగించుకుని తిరిగివస్తుండగా సముద్ర అలల తాకిడికి తెప్ప బోల్తా పడటంతో మత్స్యకారుడు అమర మోహనరావు(50) మృతిచెందాడు. తెప్పలో ఉన్న మరో నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మృతుడికి భార్య లక్ష్మమ్మ, పదో తరగతి, ఇంటర్ చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.