హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో రోడ్డు ప్రమాదం

TPT: నాయుడుపేట మండలం బిరదవాడ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దొరవారి సత్రం మండలం తనియాల గ్రామానికి చెందిన యువకులు బైక్‌పై నాయుడుపేట వైపు వెళ్తుండగా, బిరదవాడలోకి వెళ్తున్న టాటా ఏసీ వ్యాన్ ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.