హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా రిజర్వేషన్లపై అమిత్ షా కీలక ప్రకటన

మహిళలకు ప్రాధాన్యత కల్పించడం ప్రధాని మోదీ నిబద్ధత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. దశాబ్దాలుగా మహిళలు ఎదురుచూస్తున్న 33 శాతం రిజర్వేషన్లు సాకారం కానున్నాయని తెలిపారు. అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు చెప్పారు. ఇందుకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని అమిత్ షా కోరారు.