హైదరాబాద్: 28°C
వార్తలు

BJP, BRSల మధ్య చీకటి ఒప్పందం: అద్దంకి

TG: డీలిమిటేషన్ బిల్లుకు BRS మద్దతు ఇవ్వడం వెనుక BJPతో కుదిరిన చీకటి ఒప్పందమే కారణమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఈ రెండు పార్టీల రహస్య బంధం ఈ పరిణామంతో బయటపడిందన్నారు. దేశాన్ని విభజించే రాజకీయాల్లో భాగంగా బీజేపీ ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య కూడా చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. 2029లో జరిగే ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లు తెస్తున్నారని చెప్పారు.