హైదరాబాద్: 28°C
వార్తలు

నారీ శక్తి.. హామీ నిలబెట్టుకుంటాం: మోదీ

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళల రిజర్వేషన్‌కు సంబంధించి దశాబ్దాలుగా పోరాటం జరుగుతోందన్నారు. ఆ పోరాటంలో తానూ ఒకడినన్నారు. వారి హక్కుల విషయంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తామని వెల్లడించారు. నారీ శక్తి కోసం తమ ప్రభుత్వం వాగ్దానం చేసిందని, హామీ నిలబెట్టుకుంటామని మోదీ తెలిపారు.