హైదరాబాద్: 28°C
క్రీడలు

బుమ్రా ప్రమాదకరంగా కనిపించలేదు: గావస్కర్

NZతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా 26 ఓవర్లలో 6 మెయిడిన్లతో 49 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఐదేళ్ల తర్వాత బుమ్రాకు ఇలా వికెట్‌లేని ఇన్నింగ్స్ ఎదురైంది. అయితే రెండో కొత్త బంతితో అతని వేగం, ప్రభావం తగ్గాయని సునీల్ గావస్కర్ విశ్లేషించాడు. కొత్త బంతితో త్వరగా వికెట్లు తీయకపోతే మైదానంలో ఎక్కువ సమయం కష్టపడాల్సి వస్తుందని హెచ్చరించాడు.