హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గుడ్డుతో కలిపి ఇవి తింటున్నారా..?

గుడ్డు తినడం వల్ల గుండెకు ముప్పు లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే దానితో కలిపి తినే వెన్న, వైట్ బ్రెడ్, ప్రాసెస్ చేసిన మాంసంలోని సంతృప్త కొవ్వులే ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉండే గుడ్డును ఆరోగ్యవంతులు రోజూ, గుండె సమస్యల ముప్పు ఉన్నవారు వారానికి 6 వరకు తినవచ్చని సూచిస్తున్నారు. గుడ్డుతో పాటు కూరగాయలు తీసుకుంటూ కొవ్వులు తగ్గిస్తే మంచిది.