హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నైట్ డ్యూటీతో గుండె ఆరోగ్యానికి ముప్పు!

రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని పనిచేసే అలవాటు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 42,671 మంది హెల్త్‌కేర్ ఉద్యోగులపై నిర్వహించిన పరిశోధనలో నైట్ డ్యూటీ చేసేవారిలో గుండె సంబంధిత సమస్యల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా నిద్ర సమయం తగ్గడం, వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వెల్లడించారు.