హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చలికాలంలో గుండెను ఎలా కాపాడుకోవాలి?

చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు తల, చెవులు, ఛాతీ భాగాలను చలి నుంచి కాపాడుకోవాలి. ఉదయం మరీ చల్లగా ఉన్నప్పుడు వాకింగ్ సమయాన్ని మార్చుకోవచ్చు. అవసరమైతే ఇంట్లోనే తేలికపాటి వ్యాయామం చేయాలి. ఒక్కసారిగా తీవ్రమైన శారీరక శ్రమ చేయకూడదు. ఆకుకూరలు, కాలానుగుణ పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు, నూనెలో వేయించిన ఆహారం, స్వీట్లను తగ్గించాలి.