హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రాత్రిళ్లు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా..?

పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూడటం వల్ల కళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫోన్ నుండి వచ్చే నీలి కాంతి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యతో పాటు తలనొప్పి, కంటి చూపు మందగించడం జరుగుతుంది. మెడ నొప్పి, మానసిక ఆందోళన కూడా పెరుగుతాయి. అందుకే నిద్రపోయే గంట ముందు ఫోన్ పక్కన పెట్టడం ఉత్తమం.