హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పీరియడ్స్‌లో ఇవి తింటే మంచిది

నెలసరి నొప్పులు, ఉబ్బరం తగ్గాలంటే ఆహారంలో జాగ్రత్తలు అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మైదా, బ్రెడ్‌కు బదులు శనగపిండి అట్లు, రాగిజావ తీసుకోండి. టీ, కాఫీలు తగ్గించి, గోరువెచ్చని హెర్బల్ టీ, నీరు తాగండి. వేపుళ్లకు బదులు ఉడికించిన శనగ చాట్ తినండి. పాలకూర, తోటకూర, పప్పులతో ఐరన్, మెగ్నీషియం అందుతాయి. ఇవి శక్తినిచ్చి అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.