ASF: ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో భూగర్భ జలాల మట్టాన్ని పెంచడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సర్పంచ్ జబరి రవీందర్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోజురోజుకూ భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని కోరారు.
తెలంగాణ
భూగర్భ జలాల పెంపునకు గ్రామంలో స్పెషల్ డ్రైవ్


