హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం'

కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఎం. సుధాకర్ బాబు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పూలే పోరాడారని కొనియాడారు. మహిళా సాధికారత, సామాజిక సమానత్వానికి ఆయన కృషి చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.