ELR: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వేళ నిడమర్రు (M) డి.గోపవరంలో ఓ వినూత్న బ్యానర్ పలువురిని ఆకర్షిస్తుంది. గ్రామంలో నివాసం ఉంటున్న మద్దిరాల నాగేశ్వరావు కుటుంబం తమ ఇంటి ముందు ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. మా ఇంట్లో ఓట్లకు డబ్బులు, బహుమతులు తీసుకోము, ఎన్నికలలో ఎవ్వరు గెలిచినా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు. వారిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నిడమర్రులో ఆకట్టుకుంటున్న వినూత్న బ్యానర్


