హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల భద్రతపై అడిషనల్ ఎస్పీ సమీక్ష

సత్యసాయి: ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై అడిషనల్ ఎస్పీ అంకిత సురానా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం పుట్టపర్తి, కొత్తచెరువు సర్కిల్ కార్యాలయాల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సమావేశమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు, బారికేడ్ల ఏర్పాటు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు నిఘాతో ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా చూడాలని ఆదేశించారు.