హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూలేకు ఘన నివాళులు

ASR: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని అరకులోయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.