హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొబేషనరీ అధికారులకు ఎన్నికల బందోబస్తుపై అవగాహన

ఏలూరు: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ప్రొబేషనరీ ఐపీఎస్, డీఎస్పీలకు ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో క్షేత్రస్థాయి విధులు, బందోబస్తు ప్రణాళిక, బలగాల మోహరింపు, కమాండ్ కంట్రోల్ రూమ్, పోల్ కామ్ యాప్, డ్రోన్ల పర్యవేక్షణ, కౌంటింగ్ భద్రతపై వివరించారు.