హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బియ్యం వ్యాపారులకు జేసీ హెచ్చరిక

ATP: బియ్యం వ్యాపారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను అప్‌డేట్ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.