GNTR: మహాత్మా జ్యోతిరావు ఫూలే మహోన్నత సంఘ సంస్కర్త అని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జేసి మాట్లాడుతూ.. సామాజిక అసమానతలు, కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వ్యక్తి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్లో ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి


