హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమసమాజ నిర్మాణమే పూలేకు నివాళి'

ఏలూరు: మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతిని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ఇనగడపు సతీష్ నేతృత్వంలో నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక అసమానతలపై ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను మోదీ ప్రభుత్వం ఆచరణలో చూపుతోందని నేతలు పేర్కొన్నారు.