KRNL: ఆదోని 7వ వార్డు అరుణ్ జ్యోతి నగర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని బీజేపీ నాయకురాలు ఎం. మల్లికా కోరారు. 4 ఇంచుల పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని శనివారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. మారెమ్మ, దుర్గమ్మ ఆలయాల వద్ద 2 ఇంచుల పైప్‌లైన్‌తో నీరు సరిపోవడం లేదని వివరించారు. స్పందించిన కమిషనర్ త్వరలో పైప్‌లైన్ పనులు ప్రారంభిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్య పరిష్కారానికి వినతి


