హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికల పోటీ వయసు తగ్గింపునకు సుప్రీం నో

ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును తగ్గించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. దీంతో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకోగా, అందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. కాగా, ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయసు 25 ఏళ్లుగా ఉంది.