హైదరాబాద్: 28°C
వార్తలు

'సంపాదించిన విజ్ఞానం పదిమందికి ఉపయోగపడాలి'

AP: రాజమహేంద్రవరం జిల్లా కోర్టు 222 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో జస్టిస్ పీఎస్ నరసింహ పాల్గొన్నారు. తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. 44 తరాల చరిత్ర కలిగిన బార్ అసోసియేషన్ ఉండటం గొప్ప విషయమని పేర్కొన్నారు. వృత్తితో పాటు విజ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యమివ్వాలని, సంపాదించిన జ్ఞానం పదిమందికి ఉపయోగపడేలా చూడాలని సూచించారు.