హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులకు మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక

NLR: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కొడవలూరు ఎస్సై కోటిరెడ్డిని పోలీసు దుస్తులు తొలగించి పసుపు బట్టలు వేసి తడికల బజారులో నిలబెడతానని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం నార్త్ రాజుపాలెంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.